AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Type 2 Diabetes: వ్యాయామంతో టైప్‌ 2 డయబెటిస్‌కు చెక్‌.. పరిశోధనలో వెల్లడి..

Type 2 Diabetes: మధుమేహం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మధుమేహం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల..

Type 2 Diabetes: వ్యాయామంతో టైప్‌ 2 డయబెటిస్‌కు చెక్‌.. పరిశోధనలో వెల్లడి..
Type 2 Diabetes
Shaik Madar Saheb
|

Updated on: Mar 07, 2021 | 3:00 PM

Share

Type 2 Diabetes: మధుమేహం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మధుమేహం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి వీరికి ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ఒక్కటే కాదు. దాని ప్రభావం రక్తనాళాలు, నాడులు, ఎముకలు, మూత్రపిండాలు… ఇలా శరీరంలోని ప్రతి అవయవం మీదా ఉంటుందని నిపుణుల అధ్యయనంలో తేలింది. ప్రధానంగా వ్యాధినిరోధకశక్తి తగ్గడం మూలంగా ఎలాంటి బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు అయినా వీరికి తేలికగా సోకుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే ఇన్‌ఫెక్షన్ల నుంచి సమర్థంగా తప్పించుకోచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. అయితే.. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్దతులను పాటించాలి. దీనివల్ల రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చని పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు వ్యాయామం చేయడం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ శారీరక శ్రమ లేదా వ్యాయామం అనేది ప్రజలకు సర్వసాధారణం.. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాలలో నివసించేవారికి సురక్షితమైన మధుమేహ నివారణ వ్యూహం శారీరక శ్రమ అని నిపుణులు పేర్కొంటున్నారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ (EASD) జర్నల్ డయాబెటోలాజియాలో ఈ కొత్త అధ్యయనం ఫలితాలు ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాయామం టైప్ 2 డయాబెటిస్ వారికి సాధారణ శారీరక శ్రమ వ్యాధి నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే.. టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌పై శారీరక శ్రమ, కాలుష్య బహిర్గతం, మిశ్రమ ప్రభావాలను పరిశోధించిన మొట్టమొదటి అధ్యయనంగా ఈఏఎస్డీ పరిశోధన నిలిచింది. ఈ అధ్యయనానికి చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్‌ మెడిసిన్ ఫ్యాకల్టీ డాక్టర్ కుయ్ గువో, ప్రొఫెసర్ లావో జియాంగ్ కియాన్ నాయకత్వం వహించారు. ఈ పరిశోధనలో పలువురు ప్రొఫెసర్లు, రిసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు.

టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధికి వాయు కాలుష్యం ఒక కొత్త ప్రమాద కారకమని తేలింది. అయితే.. శారీరక శ్రమ వాయు కాలుష్య కారకాలను పీల్చడాన్ని మరింత పెంచుతుంది. వాయు కాలుష్యమనేది ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో 1,56,314 మంది టైప్ 2 డయాబెటిస్ వారిని పరీక్షించారు. దీంతోపాటు తైవాన్‌లో మొత్తం 422,831కి వైద్య పరీక్షలు నిర్వహించారు. శారీరక శ్రమ చేసేవారికి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 64 శాతం తక్కువగా ఉంటుందని తేలింది. స్లమ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు శారీరక శ్రమ అనేది మధుమేహ నివారణకు సురక్షితమైన వ్యూహమని వారు జర్నల్ లో వివరించారు.

Also Read:

Watermelon: పుచ్చకాయ ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో రోగాలు దూరమవుతాయి.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు