Rain Alert: వానలే.. వానలు.. అల్ప పీడనం ఎఫెక్ట్‌తో మళ్లీ భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ప్రభావంతో ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధముగా ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి వైపునకు వంగి ఉంటుంది.
మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ప్రభావంతో ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు ఉత్తర ఆంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధముగా ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి వైపునకు వంగి ఉంటుంది. ఉత్తర భారతదేశం మీద ఉన్న గాలులు కోత 16° ఉత్తర అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది దక్షిణం దిశ వైపు వంగి ఉంటుంది. వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ :-
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..