AP Weather Alert: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

AP Weather Alert: ఏపీలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల బీభత్సం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. అయితే మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అమరావతి..

AP Weather Alert: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
Ap Weather Report
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2021 | 1:57 PM

AP Weather Alert: ఏపీలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల బీభత్సం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. అయితే మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి బంగాళా ఖాతం దగ్గర ఉన్నదక్షిణ శ్రీలంక తీరము మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు కోమరిన్ ప్రాంతం తో పాటు  దానిని ఆనుకొని ఉన్న శ్రీ లంక తీర ప్రాంతం మీద ఉందని తెలిపింది. ఇది సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించిఉంది.  వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో సుమారు నవంబర్ 29 , 2021 వ తేదీకల్లా ఏర్పడవచ్చునని.. దీంతో ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణిం చే అవకాశం ఉందని వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర -యానాం : ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది .ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. Also Read:

 నాడు చుక్కనీరు పడని బోరుబావి నుంచి ఉబికివస్తున్న భూగర్భ జలం..!