Tomato: రికార్డు సృష్టిస్తున్న టమాటా ధర.. కర్నూలు జిల్లా ఆస్పరిలో కిలోకు రూ.150..

టమాటా ధర వాయువేగంతో దూసుకెళ్తోంది. పెట్రోల్, డీజిల్ రేటు దాటేసింది. కర్నూలు జిల్లా ఆస్పరి కూరగాయల మార్కెట్ చరిత్రలో టమాటా రికార్డు ధర పలికింది. 25 కిలోల టమోటా బాక్స్ 3750 రూపాయలు పలికింది. అంటే కిలోకు 150 రూపాయలు పలికింది...

Tomato: రికార్డు సృష్టిస్తున్న టమాటా ధర.. కర్నూలు జిల్లా ఆస్పరిలో కిలోకు రూ.150..
Tamoto
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 26, 2021 | 1:48 PM

టమాటా ధర వాయువేగంతో దూసుకెళ్తోంది. పెట్రోల్, డీజిల్ రేటు దాటేసింది. కర్నూలు జిల్లా ఆస్పరి కూరగాయల మార్కెట్ చరిత్రలో టమాటా రికార్డు ధర పలికింది. 25 కిలోల టమోటా బాక్స్ 3750 రూపాయలు పలికింది. అంటే కిలోకు 150 రూపాయలు పలికింది. టమాటే కాదు మిగతా కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో బీరకాయ రూ.80లు పలుకుతుంది. కిలో వంకాయ ధర 60 రూపాయలు ఉంది. అసలే పెట్రోల్, డీడిల్, వంట గ్యాస్ రేట్లు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే తాజాగా కూరగాయల ధరలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు సబ్బులు, సర్ఫులు, బిస్కెట్ల రేట్లు కూడా పెరిగాయి. దీంతో ప్రజలు ఏమి కొనలేకపోతున్నారు.

కిలో టమాటా ధర దాదాపు కిలో చికెన్‎ ధరకు చేరువలో ఉంది. గత నెలన్నరగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో టమాటా సరఫరాకు అంతరాయం కలుగుతోందని, ఫలితంగా ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలు చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే మరోపక్క రైతులు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వాస్తవానికి అక్టోబర్‌లో కురిసిన అకాల వర్షాలకు టమాటా పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పుడు మిగిలిన పంటకు అధిక ధర గిట్టుబాటు అవుతుండడంతో కొంతైనా తమ నష్టాన్ని పూడ్చుకోగలుగుతున్నామని రైతులు అంటున్నారు.

Read Also.. Bore Well Water: నాడు చుక్కనీరు పడని బోరుబావి నుంచి ఉబికివస్తున్న భూగర్భ జలం..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?