Bore Well Water: అనంతపురం జిల్లాలో వింత.. ఎండిపోయిన బోరు నుంచి ఉబికి వస్తున్న జలాలు
Bore Well Water: నాడు చుక్క నీటి కోసం కోటి తిప్పలు పడుతుండగా, నేడు ఎండిపోయిన బోరు బావిల్లో భూగర్భ జలం పొందిపొర్లుతోంది. అనంతపురం జిల్లా మడకశిర..
Bore Well Water: నాడు చుక్క నీటి కోసం కోటి తిప్పలు పడుతుండగా, నేడు ఎండిపోయిన బోరు బావిల్లో భూగర్భ జలం పొందిపొర్లుతోంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠ పురంలో బోరు బావి నుండి భూగర్భ జలం పైకి వస్తోంది. గతంలో 900 అడుగులు బోరు వేసిన చుక్కనీరు పడని ఇదే బోరుబావిలో నీరు పొంగిపొర్లుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అడుగంటిన భూగర్భ జలాలు మెరుగు పడ్డాయి. అయితే తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి భూగర్భజలం చూడలేదు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. మడకశిర పంచాయతీలో తాగునీటి కోసం ఎన్నో బోర్లు వేయించానని ఆయన గుర్తు చేశారు.
మరో ఐదేళ్లు భూగర్భ జలాలకు ఢోకా లేదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మడకశిర మండలం దాసప్ప పాలెంలో ఓ రైతు పొలంలో ఎండిపోయిన బోరు బావి నుండి కేసింగ్ పైపు నుండి భూగర్బ జలం పొంగిపొర్లడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. వందలాది ఫీట్ల లోతులో ఉన్న నీరు పైరా రావడం అందరిని ఆశ్చర్యం కలిగించేలా చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: