AP Weather Alert: మండుటెండల్లో చల్లని కబురు.. ఆ ప్రాంతంలో రాబోయే మూడు రోజులపాటు..

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..

AP Weather Alert: మండుటెండల్లో చల్లని కబురు.. ఆ ప్రాంతంలో రాబోయే మూడు రోజులపాటు..
Hot And Dry Weather
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 22, 2022 | 7:06 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూగు రోజులు కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఇలా ఉండనుంది.

ఉత్తరకోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఇవాళ తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి వర్షాలు/ ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ ఇంచుమించు ఇదేరకమైన వాతావరణం ఉంటుందన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు.

వాతావరణ సంబంధిత మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Viral Video: నిమ్మకాయ ధర కొండెక్కితే రియాక్షన్‌ ఇట్లే ఉంటుంది.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద షాక్‌..!