Laptop Exploded: ల్యాప్‌టాప్ పేలిన ఘటనలో గాయపడ్డ సుమలత మృతి.. విషాదంలో కుటుంబం
ల్యాప్‌టాప్ పేలిన ఘటనలో గాయపడ్డ సుమలత మృతి.. తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Laptop Exploded: ల్యాప్‌టాప్ పేలిన ఘటనలో గాయపడ్డ సుమలత మృతి చెందింది. ఆమె తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. సోమవారం కడప జిల్లా మేకవారిపల్లెలో సుమలత (22) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ల్యాప్ టాప్ పేలడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతి (Tirupati)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సుమలత తన ఇంట్లోనే ఉంది. ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి అలాగే పని చేస్తుండగా, ఒక్కసారిగా ల్యాప్‌టాప్ పేలిపోయింది. ల్యాప్‌టాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు భారీగా చెలరేగాయి. దీంతో మంచం, పరుపునకు మంటలు అంటుకుని ఇల్లంత వ్యాపించాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
సుమలత బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మూడు నెలల కిందటనే ఉద్యోగంలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సుమలతను ఆస్పత్రికెళ్లినప్పటికే ఆమెకు 80 శాతం వరకు గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి మరింత విషమించంతో మృతి చెందింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడ చదవండి: