AP Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల గుర్తులు ఇవే..!

ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పంచాయతీ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులను...

AP Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల గుర్తులు ఇవే..!
AP Panchayat Election Symbols
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 08, 2021 | 7:59 PM

AP Panchayat Election Symbols : ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పంచాయతీ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులను ఇప్పటికే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచి అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు మెంబర్లకు 20 గుర్తులను కేటాయించారు. ఈసారి సర్పంచి అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయించారు. తొలిసారి అభ్యర్థుల జాబితాలో చివర నోటా గుర్తు ఉంటుంది.

సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఇవి..

సర్పంచ్ అభ్యర్థులకు గొలుసు, కుర్చీ, బ్యాట్‌, మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కొవ్వొత్తులు, నల్లబోర్డు, కప్పుసాసరు, క్యారెట్‌, తాళం చెవి, మొబైల్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష, తిరగలి, కుండ, అరటిపండు, అనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా తదితర గుర్తులను కేటాయించారు.

వార్డు మెంబర్ అభ్యుర్థుల గుర్తులు..

ఇక వార్డు మెంబర్ అభ్యర్థులకు కుక్కర్‌, గౌను, స్టూలు, బీరువా, ఐస్ ‌క్రీమ్‌, కెటిల్‌, ఇస్త్రీపెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్‌ పొయ్యి, కటింగ్‌ప్లేయర్‌, గరిట, ఎలక్ట్రిక్ ‌స్తంభం, బెండకాయ, బెల్టు, కోటు, డిష్‌ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారంబోర్డు, వయొలిన్ తదితర గుర్తులను అభ్యర్థులకు కేటాయించారు. ఇక వీటితోపాటుగా ప్రతి బ్యాలెట్ పేపర్ చివర నోటా గుర్తు కూడా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి..

ICC Appoints BYJU’S : ప్రసార, డిజిటల్ హక్కులతోపాటు ఐసీసీ గ్లోబల్ పార్ట్నర్‌గా బైజూస్.. Share Market Today : దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలు పైపైకి..