AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Appoints BYJU’S : ప్రసార, డిజిటల్ హక్కులతోపాటు ఐసీసీ గ్లోబల్ పార్ట్నర్‌గా బైజూస్..

ఐసీసీ కొత్త పార్టనర్‌ను ప్రకటించింది. రాబోయే మూడేళ్ల పాటు బైజూస్ తమ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తుందని ఐసీసీ తెలిపింది. రానున్న మూడేళ్ల పాటు బైజూస్​ తమ ప్రపంచ భాగస్వామిగా..

ICC Appoints BYJU'S : ప్రసార, డిజిటల్ హక్కులతోపాటు ఐసీసీ గ్లోబల్ పార్ట్నర్‌గా బైజూస్..
ICC appoints BYJU'S
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 08, 2021 | 4:32 PM

ICC Appoints BYJU’S : ఐసీసీ కొత్త పార్టనర్‌ను ప్రకటించింది. రాబోయే మూడేళ్ల పాటు బైజూస్ తమ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తుందని ఐసీసీ తెలిపింది. రానున్న మూడేళ్ల పాటు బైజూస్​ తమ ప్రపంచ భాగస్వామిగా కొనసాగుతుందని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ICC) ప్రకటించింది. 2021 నుంచి 2023 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని వెల్లడించింది.

భారత్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌తోపాటు న్యూజిలాండ్‌లో జరగనున్న ఉమెన్స్ వరల్డ్ కప్‌‌ భాగస్వామిగా ఉంటుంది. అంతే కాకుండా ఐసీసీ పరిధిలో జరిగే అన్ని ఈవెంట్లకు బైజూస్ అధికారిక భాగస్వామిగా ఉంటుంది.దీనితోపాటు ప్రసార, డిజిటల్​హక్కులను బైజూస్ కలిగి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. బెజూస్.. భారతదేశంలోని అతిపెద్ద టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్​సంస్థ గుర్తింపు ఉంది.

2019 ఆగష్టు నుంచి టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ బ్రాండింగ్ చేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఈవెంట్లను ఇది నిర్వహిస్తోంది. వినూత్న రీతిలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. టీమిండియా స్పాన్సర్లలో ఒకటైన బైజూస్​ సంస్థ స్థాపకులు, సీఈఓ బైజూ రవీంద్రన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.  ఐసీసీ ప్రపంచ భాగస్వాముల్లో​ఒకటని చెప్పడానికి సంతోషిస్తున్నాము అని పేర్కొన్నారు. బైజూస్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా తెలిపారు.

క్రికెట్​ అనే ఆటలో పట్టుదల, నమ్మకం అనేవి చాలా ముఖ్యం అని వెల్లడించారు. చాలా మంది భారతీయ యువకులు క్రికెట్​ను అమితంగా ప్రేమిస్తారుని ఆయన అన్నారు. మా ఈ భాగస్వామ్యం ద్వారా అధిక మంది యువకుల హృదయాలను గెలవాలని కాంక్షిస్తున్నాము అంటూ బైజూ రవీంద్రన్​ తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

Jaguar Land Rover: భారత రహదారులపై దూసుకెళ్లనున్న ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 4.8 సెకండ్లలో 100 కి.మీ వేగం.. నాపై అవిశ్వాస తీర్మానం పెడతారా ? నో ప్రాబ్లమ్ ! రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు మనస్తాపం

పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశంపై నిర్మాణం
పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశంపై నిర్మాణం
పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?
పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు
ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..