AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Eng 1st Test: లంచ్ బ్రేక్.. ఆదిలోనే ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన టీమిండియా.. సెకండ్ ఇన్నింగ్స్ 1/1

Ind Vs Eng 1st Test: చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన..

Ind Vs Eng 1st Test: లంచ్ బ్రేక్.. ఆదిలోనే ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన టీమిండియా.. సెకండ్ ఇన్నింగ్స్ 1/1
Ravi Kiran
|

Updated on: Feb 08, 2021 | 11:57 AM

Share

Ind Vs Eng 1st Test: చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌‌కు టీమిండియా ఆదిలోనే షాక్ ఇచ్చింది. ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించింది. ప్రస్తుతం క్రీజులో సిబ్లీ(0), లారెన్స్(0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఓ వికెట్ తీశాడు. కాగా, ఇంగ్లాండ్ 242 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.

ఇది కూడా చదవండి:

India Vs England 1st Test Day 4: రసవత్తరంగా మారిన తొలి టెస్టు.. నాలుగో రోజు పైచేయి సాధించేది ఎవరు.?