TDP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్.. రూ.50 వేల పూచీకత్తుతో మంజూరు..
Atchannaidu Gets Bail: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రూ.50 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్..
Atchannaidu Gets Bail: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రూ.50 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అచ్చెన్నకు ఫిబ్రవరి 2న కోటబొమ్మాలి కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడుతో పాటు మరో 21 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడును ఫిబ్రవరి 2న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం అచ్చెన్నాయుడు కోరగా ఓసారి వాయిదా వేసిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.