ACB Raids Forest Officer: ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ .. రైతు వద్ద రూ. 50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారిని
ఏపీలో మహిళా అధికారుల అవినీతి కథలు రోజుకో జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. నిన్న శ్రీకాకుళంలో ఓ మహిళా అధికారిని ఏకంగా సీసీ కెమెరాకే ఫోజులిస్తూ..లంచం తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. తాజాగా కృష్ణా జిల్లాలో మరో మహిళా అధికారిని ఏసీబీ అధికారులు...
ACB Raids Forest Officer: ఏపీలో మహిళా అధికారుల అవినీతి కథలు రోజుకో జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. నిన్న శ్రీకాకుళంలో ఓ మహిళా అధికారిని ఏకంగా సీసీ కెమెరాకే ఫోజులిస్తూ..లంచం తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. తాజాగా కృష్ణా జిల్లాలో మరో మహిళా అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ వలలో కృష్ణాజిల్లా మైలవరం ఫారెస్ట్ రేంజ్, ఏ.కొండూరు ఫారెస్ట్ సెక్షన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.శేషకుమారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శేషకుమారి ఏసునాయక్ అనే రైతు వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రైతు ఏసు నాయక్ రెండుఎకరాల అటవీభూమికి ఆర్వోఆర్ పట్టా మంజూరు చేయాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలసాని శేషుకుమారిని ఆశ్రయించాడు. ఆర్వోఆర్ పట్టా మంజూరు చేయాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. ఈ మేరకు రైతు ఏసునాయక్ శేషకుమారి ఇంటి వద్ద ముందుగా 50వేలు ముట్టజెప్పాడు. రైతు వద్ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శేషకుమారి లంచం తీసుకుంటుండగా ఆమెను ఎసిబి, డీఎస్పీలు.. శరత్ బాబు, శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు.
Also Read: