ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి తిమింగళం.. డీఎఫ్‌ఓ ప్రకాష్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..
అర్బన్ ఫారెస్ట్ అధికారి ఇనుపనూరి ప్రకాష్‌ను ఏసీబీ అధికారులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. బిల్ పాస్ చేయడం కోసం కాంట్రాక్టర్ల నుండి లంచాలు తీసుకున్నట్లు ప్రకాష్‌పై ఆరోపణలు వచ్చాయి.
అర్బన్ ఫారెస్ట్ అధికారి ఇనుపనూరి ప్రకాష్‌ను ఏసీబీ అధికారులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. బిల్ పాస్ చేయడం కోసం కాంట్రాక్టర్ల నుండి లంచాలు తీసుకున్నట్లు ప్రకాష్‌పై ఆరోపణలు వచ్చాయి. ప్రకాష్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజులు పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రకాష్ కార్యాలయంలో రూ.10 లక్షల 50వేలు, అతని కారులో రూ.20 వేల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 5 లక్షల 14వేల నగదును సీజ్ చేశారు. ఇక పెండింగ్‌లో పెట్టిన కాంట్రాక్టర్లకు చెందిన 26 ఫైల్స్‌ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రకాష్ ఇల్లు రూ.30 లక్షల విలువ చేస్తుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఖమ్మంలో రూ.కోటీ 10 లక్షల కమర్షియల్ కాంప్లె్క్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రకాష్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించిన ఏసీబీ అధికారులు.. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో విచారణ సాగిస్తున్నారు.