AP Politics: నందమూరి కుటుంబం నిజాలు తెలుసుకోవాలి.. ఏపీ మంత్రి పేర్నినాని

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని, రాజకీయాల కోసమే టీడీపీ అధినేత ఈ విషయాన్ని వాడుకుంటున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు..

AP Politics: నందమూరి కుటుంబం నిజాలు తెలుసుకోవాలి.. ఏపీ మంత్రి పేర్నినాని
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 6:43 PM

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని, రాజకీయాల కోసమే టీడీపీ అధినేత ఈ విషయాన్ని వాడుకుంటున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవడం చేతకాకే ఇలా నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. అసలు రాజకీయాలు ఈ స్థాయికి రావడానికి టీడీపీ అధినేతే కారణమని మంత్రి పేర్కొన్నారు. తన భార్యపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని శుక్రవారం చంద్రబాబు కంటతడి పెట్టడం, ఈరోజు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబం మొత్తం సమావేశమై వైసీపీ నేతలపై విమర్శలు చేయడంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. నందమూరి కుటుంబ సభ్యులు తమ సభ్యులపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నిజం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

రాజకీయ లబ్ధికోసమే ఈ నాటకం.. ‘రాజకీయాలు చేతకాక చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. అసత్యాలతో మా ప్రభుత్వంపై బురదచల్లాలనుకుంటున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అసలు అసెంబ్లీలో అనని మాటలు, జరగని విషయాలను కూడా చెడుగా చిత్రీకరిస్తున్నారు. మేం చంద్రబాబు సతీమణి పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రజలు, టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి. రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈరోజు(శనివారం) నందమూరి కుటుంబ సభ్యులు మా ఎమ్మెల్యే లు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి పై అనవసరంగా విమర్శలు చేశారు. వైసీపీ సభ్యులు ఏదేదో అన్నట్లు నందమూరి కుటుంబం మాట్లాడుతోంది. మా ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారు.. ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో మాకు తెలుసు. ఎన్టీఆర్ గురించి ఆయన సొంత కుటుంబ సభ్యుల్లోనే విషం ఎక్కించిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ దుర్మార్గుడని సాక్షాత్తూ ఆయన కన్న బిడ్డలనే నమ్మించిన చరిత్ర టీడీపీ అధినేతకు ఉందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాలను బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబం గ్రహించాలి’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

Also read:

Nandamuri Balakrishna: ‘అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా’.. వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్

Nandamuri Balakrishna: ‘నా సోదరి జోలికి వస్తారా’.. వైసీపీ నేతల కామెంట్స్‌పై నిప్పులు చెరుగిన బాలయ్య..(వీడియో)

Tirupati Rains: భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం..తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి..