AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bapatla: లంచం వ్యవహారం తనకు చుట్టడంపై మంత్రి ఆగ్రహం.. ఎస్పీకి ఫిర్యాదు

ఏసీబీ రైడ్ చేసిన రోజు బాధితుడు గోవిందు మీడియాతో మాట్లాడుతూ తన వద్ద తీసుకున్న డబ్బుల్లో రెండు లక్షల రూపాయలను ఎస్సై భరత్.. మంత్రి మేరుగ నాగార్జున పంపించాడని ఆరోపించాడు. ఎస్సై తన ముందే మంత్రితో మాట్లాడినట్లు తెలిపాడు. దీనిపై బాపట్లలో పెద్ద వివాదం రాజుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Bapatla: లంచం వ్యవహారం తనకు చుట్టడంపై మంత్రి ఆగ్రహం.. ఎస్పీకి ఫిర్యాదు
Merugu Nagarjuna
T Nagaraju
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 16, 2023 | 4:55 PM

Share

అది బాపట్ల జల్లా చుండూరు… 9వ తేది శుక్రవారం. చుండూరు మార్కెట్ సెంటర్‌లో కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఆ ఇద్దరూ వ్యక్తులు ఎవరో కాదు మఫ్టిలో ఉన్న కానిస్టేబుళ్లు. అంతేకాదు వారికి సహకరించిన ఎస్సై భరత్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.  ఓ కేసులో బాపట్ల జిల్లా బాపట్లకు చెందిన బత్తుల గోవిందు మట్టిని తరలించాడని ఆరోపణలు రావటంతో అతన్ని చుండూరు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేశారు. అతను ప్రయాణించిన కారును పోలీసులు సీజ్ చేసి స్టేషన్ లో ఉంచారు. అయితే గోవిందు తన కారు తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. అయితే స్టేషన్ లో ఎస్సైగా ఉన్న భరత్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వలేనంటూ రెండు లక్షల నలభై వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. రెండు లక్షల రూపాలిచ్చిన గోవిందు మరో నలభై వేలు ఇవ్వడం ఇష్టం లేక ఏసిబిని ఆశ్రయించాడు.

ఈ నెల తొమ్మిదో తేదిన మిగిలిన నలభై వేలు ఇస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే కానిస్టేబుళ్ళు క్రాంతి, రవీంద్రలు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఎస్సై భరత్ పై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అధికారులు సస్పండ్ చేశారు. ఇంతటితో ఈ వివాదం ముగిసి పోలేదు. ఏసీబీ రైడ్ చేసిన రోజు బాధితుడు గోవిందు మీడియాతో మాట్లాడుతూ తన వద్ద తీసుకున్న డబ్బుల్లో రెండు లక్షల రూపాయలను ఎస్సై భరత్.. మంత్రి మేరుగ నాగార్జున పంపించాడని ఆరోపించాడు. ఎస్సై తన ముందే మంత్రితో మాట్లాడినట్లు తెలిపాడు. దీనిపై బాపట్లలో పెద్ద వివాదం రాజుకుంది.

గోవిందు ఆరోపణలపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ అయ్యారు. గోవిందు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో వదిలి పెట్టకుండా ఏకంగా బాపట్ల జిల్లా ఎస్సీకి గోవిందుపై మంత్రి పిర్యాదు చేశారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. టీడీపీకి చెందిన గోవిందు చేసిన ఆరోపణలు ఎవరున్నారో తేల్చాలన్నారు. ఏసీబీ దాడి అంశం చిలికి చిలికి గాలి వానగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…