AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చంద్రబాబు మెడికల్ రిపోర్టులపై అనుమానాలున్నాయి.. సజ్జల కీలక వ్యాఖ్యలు

Watch: చంద్రబాబు మెడికల్ రిపోర్టులపై అనుమానాలున్నాయి.. సజ్జల కీలక వ్యాఖ్యలు

Janardhan Veluru
|

Updated on: Nov 16, 2023 | 4:22 PM

Share

చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారంటూ ఆయన తరఫున న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు మెడికల్ రిపోర్ట్‌ను మెమో ద్వారా సమర్పించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులపై అనుమానాలున్నాయన్నారు. అనారోగ్యం బూచి చూపి బయటకొచ్చిన చంద్రబాబు రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు నాయుడి మెడికల్ రిపోర్టులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తంచేశారు. వైద్యులు తప్పుడు మెడికల్ రిపోర్ట్‌లు ఇచ్చారని తెలుస్తోందని ఆరోపించారు. బాబుకు వైద్య చికిత్స చేసిన వారు పొలిటికల్ వైద్యులా? అంటూ విస్మయం వ్యక్తంచేశారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులపై మెడికల్‌ బోర్డ్‌లో చర్చ జరగాలన్నారు. అనారోగ్యం బూచి చూపి బయటకొచ్చిన చంద్రబాబు రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారంటూ ఆయన తరఫున న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు మెడికల్ రిపోర్ట్‌ను మెమో ద్వారా సమర్పించడంపై స్పందిస్తూ సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ-జనసేన పొత్తు, మేనిఫెస్టోలపై విరుచుకుపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రెండు పార్టీలు కలిసి డ్రామాను క్రియేట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు మేనిఫెస్టో అంటే అర్థం కూడా తెలీదన్నారు. ఏపీలో ఇద్దరి మధ్య కుదిరిన పొత్తు..తెలంగాణలో ఎందుకు కుదరలేదని ఆయన ప్రశ్నించారు. జనసేన ఏపీలో టీడీపీ.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై స్పందిస్తూ.. పవన్ ఒకేసారి ఎంతమందితో సంసారం చేస్తారని ఎద్దేవా చేశారు.

పురందేశ్వరికి చంద్రబాబు అజెండా తప్ప ఇంకోటి లేదని సజ్జల అన్నారు. చంద్రబాబు ప్రతినిధులుగా నాదెండ్ల మనోహర్, పురందేశ్వరి కనబడుతున్నారని అన్నారు. 2014లో మోసం చేసినట్టు 2024లో ఎందుకు చేయలేము అనే బరి తెగింపు టీడీపీలో ఉందన్నారు. పవన్ కానీ చంద్రబాబు కానీ ఏపీ లో ప్రజల్ని ఆకట్టుకోవాలంటే ఇదా పద్ధతి అని ప్రశ్నించారు.

Published on: Nov 16, 2023 04:16 PM