AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య మెడలో జనసేన కండువా.. పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు - Watch Video

Balakrishna: బాలయ్య మెడలో జనసేన కండువా.. పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు – Watch Video

Janardhan Veluru
|

Updated on: Nov 16, 2023 | 5:57 PM

Share

హిందూపురంలో నిర్వహించిన టీడీపీ-జనసేన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు స్వయంగా ముందుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం సుశిక్షితులైన సైనికులుగా రెండు పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని అన్నారు.

టీడీపీ-జనసేన మధ్య పొత్తు శుభపరిణామని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. రెండు పార్టీల కలయికతో ఏపీలో కొత్త శకానికి నాంది పడిందన్నారు. హిందూపురంలో నిర్వహించిన టీడీపీ-జనసేన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు స్వయంగా ముందుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పవన్ కల్యాణ్‌తో తనకు భావసారూప్యత ఉందన్న బాలకృష్ణ.. ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడుతామని అన్నారు. ఎన్నికల కోసం సుశిక్షితులైన సైనికులుగా రెండు పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాలూ గెలుచుకునే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాలకృష్ణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ కండువాతో పాటు జనసేన కండువా కప్పుకొని ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. జై జనసేన, జై టీడీపీ అంటూ బాలయ్య నినాదాలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి

Published on: Nov 16, 2023 05:29 PM