Watch Video: విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ప్రజలకే నష్టం.. KA Paul ఆసక్తికర వ్యాఖ్యలు

Watch Video: విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ప్రజలకే నష్టం.. KA Paul ఆసక్తికర వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Nov 16, 2023 | 5:48 PM

విశాఖ నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తే అన్ని పార్టీలు తనకు మద్ధతు ఇస్తాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ పోటీ చేయడం లేదని, తనకు మద్ధతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్యానించారు.

విశాఖ ఎంపీగా తనను గెలిపించకపోతే రాష్ట్రం ఉండదు.. దేశమూ ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. అక్కడి నుంచి తనను ఎంపీగా గెలిపించకపోతే ప్రజలకే నష్టమని వ్యాఖ్యానించారు. అదే సమయంలో విశాఖ నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తే అన్ని పార్టీలు తనకు మద్ధతు ఇస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ పోటీ చేయడం లేదని, తనకు మద్ధతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తనకు మద్ధతుగా విశాఖలో ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారో, లేదో తనకు తెలియదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తానన్న తన మాటను నిలబెట్టుకున్నానని కేఏ పాల్ ప్రకటించారు. పార్లమెంటులో ప్రధాని మోదీని ఎదుర్కొనే దమ్ము తనకు మాత్రమే ఉందంటూ పొలిటికల్ పంచ్‌లు విసిరారు పాల్.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..