AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్: హోంమంత్రి అనిత

గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది ఏపీ సర్కార్‌. యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్‌.. బోర్డర్‌లో చెక్‌పోస్ట్‌లను పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. వంద రోజుల్లో గంజాయి కట్టడి దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు ఇలా..

AP News: పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్: హోంమంత్రి అనిత
Ap Home Minister
Ravi Kiran
|

Updated on: Jul 04, 2024 | 9:58 PM

Share

గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది ఏపీ సర్కార్‌. యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్‌.. బోర్డర్‌లో చెక్‌పోస్ట్‌లను పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. వంద రోజుల్లో గంజాయి కట్టడి దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం.

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని డిసైడైంది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు యుద్ధప్రాతిపదికన సన్నద్ధమవుతోంది. ఇందులోభాగంగా మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన భేటీకి నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర, సత్య కుమార్‌, సంధ్యారాణి హాజరయ్యారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై సబ్ కమిటీ చర్చించింది. మత్తు పదార్థాల రవాణాను నియంత్రించేందుకు జిల్లాలవారీగా యాంటీ నార్కొటిక్ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని పోలీసులకు కమిటి ఆదేశాలిచ్చింది. గంజాయి బాధితులకు డి అడిక్షన్ కేంద్రాలపైనా ఫోకస్ చేస్తూనే.. ప్రతీ జిల్లాకు టోల్‌ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా 5వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్టు ఓ అంచనా. ఇందులో సాగు వేసే లోగా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

కొంతమంది గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయిని సప్లయ్ చేస్తున్నారన్నారు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. అలాంటివారి కారణంగా చాలామంది జైళ్లలో మగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు. గంజాయి వైపు వెళ్లకుండా ఇతర పంటల సాగుకి గిరిజనుల్ని మళ్లించడం. అలాగే ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది కేబినెట్‌ సబ్ కమిటీ. అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు పంపించింది. ఫైనల్‌గా వందరోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?