- Telugu News Photo Gallery Cricket photos LPL 2024: Kusal Perera Breaks Pak Captain Babar Azam Record In Just 52 Balls
LPL 2024: ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. చితక్కొట్టిన ప్లేయర్ ఎవరో తెల్సా
లంక ప్రీమియర్ లీగ్(LPL 2024)లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి శ్రీలంక ప్లేయర్ కుశాల్ పెరీరా సరికొత్త రికార్డు సృష్టించాడు. అది కూడా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఆ మ్యాచ్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Jul 04, 2024 | 7:18 PM

లంక ప్రీమియర్ లీగ్(LPL 2024)లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి శ్రీలంక ప్లేయర్ కుశాల్ పెరీరా సరికొత్త రికార్డు సృష్టించాడు. అది కూడా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం. పల్లెకెలె స్టేడియంలో దంబుల్లా సిక్సర్లతో జరిగిన మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్లు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాటర్ కుశాల్ పెరీరా పేలుడు బ్యాటింగ్ ప్రదర్శించాడు. మొదటి ఓవర్ నుంచి దూకుడైన ఆటతీరుతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు పెరీరా. ఫలితంగా కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో పాటు లంక ప్రీమియర్ లీగ్‌లో కుశాల్ పెరీరాదే ఫాస్టెస్ట్ సెంచరీ.

ఇంతకుముందు ఈ రికార్డు బాబర్ ఆజామ్ పేరిట ఉంది. ఎల్‌పిఎల్ 2023 సీజన్‌లో కొలంబో స్ట్రైకర్స్ తరఫున ఆడిన బాబర్ 57 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును కుశాల్ పెరీరా బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న కుశాల్ పెరీరా 5 భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయంగా 102 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో దంబుల్లా సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

ఇక 192 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో జాఫ్నా కింగ్స్‌కు అవిష్క ఫెర్నాండో సహాయపడ్డాడు. అవిష్క ఫెర్నాండో 34 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 80 పరుగులు చేయగా, చరిత్ అసలంక 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో జాఫ్నా కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.




