- Telugu News Photo Gallery Cricket photos No ICC, IPL Trophies In 17 Years Career Of AB De Villiers, Most Unluckiest Player in Cricket History
యూనివర్స్ బాస్‌తో పోటీ, కోహ్లీతో దోస్తీ.. 17 ఏళ్ల కెరీర్‌లో ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవని అన్‌లక్కీ ప్లేయర్ అతనే
సఫారీల టీంలో ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఒక్క ప్లేయర్ చెబితే చాలు.. టీమిండియా ఫ్యాన్స్.. 'ఏయ్.. వీడు మావోడురా' అని అంటారు. అంతలా ఆ ప్లేయర్ భారత్ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయాడు. అంతేకాదు ఈ ప్లేయర్ పేరుపైన ఏకంగా బెంగళూరులో ఓ రోడ్డు ఉందంటే..
Updated on: Jul 04, 2024 | 5:13 PM

సఫారీల టీంలో ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఒక్క ప్లేయర్ చెబితే చాలు.. టీమిండియా ఫ్యాన్స్.. 'ఏయ్.. వీడు మావోడురా' అని అంటారు. అంతలా ఆ ప్లేయర్ భారత్ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయాడు. అంతేకాదు ఈ ప్లేయర్ పేరుపైన ఏకంగా బెంగళూరులో ఓ రోడ్డు ఉందంటే.. అతడి క్రేజ్ ఏపాటిదో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అవునండీ.! అతడు మరెవరో కాదు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. మనోడు క్రికెట్ హిస్టరీలోని ది మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్.. ఇది చూస్తే మీరే నమ్ముతారు.

తమ అమేజింగ్ గేమ్ ప్లే.. అలాగే దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది ఫ్యాన్స్ గుండెల్లో గుడి కట్టించుకున్నాడు ఏబీ డివిలియర్స్. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2004లో డెబ్యూ ఇచ్చిన ఏబీ.. అంచలంచలుగా ఎదుగుతూ 2007 దక్షిణాఫ్రికా వన్డే ప్రపంచకప్ స్క్వాడ్.. అలాగే 2007 సఫారీల టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.

2007-2015 మధ్య జరిగిన మూడు వన్డే ప్రపంచకప్‌లలో ఆడిన డివిలియర్స్.. ఈ సమయంలో కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీని సైతం అందుకోలేకపోయాడు. కేవలం 2015లో ఏబీ డివిలియర్స్ సారధ్యంలో సఫారీల జట్టు ఒక్కసారి మాత్రమే వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుకుంది.

టీ20 ప్రపంచకప్ విషయానికొస్తే.. 2007-2016 వరకు మొత్తంగా 5 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. ఇందులో రెండుసార్లు మాత్రమే సఫారీలు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఇక 2014లో ఏబీడీ కెప్టెన్సీలో సెమీఫైనల్ చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు.. టీమిండియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కుంది. ఇలా ఆడిన 8 ఐసీసీ టోర్నమెంట్స్‌లో మిస్టర్ 360 ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయాడు.

ఏబీ డివిలియర్స్‌కు ఐసీసీ టోర్నమెంట్స్ ఒక లెక్క అనుకుంటే.. ఐపీఎల్ మరో లెక్క. 2009 నుంచి 2021 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 11 సీజన్లు ఆడాడు డివిలియర్స్. ఈ 11 సీజన్లలో ఒక్కసారిగా కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయాడు.

ఏబీడీ క్రీజులోకి వచ్చాడంటే.. ప్రత్యర్ధులు హడలెత్తిపోవాల్సిందే. అలాగే ఫీల్డింగ్‌లోనూ ప్రాణం పెడతాడు డివిలియర్స్. అయితే ఈ స్ట్రాంగ్ ప్లేయర్ ఇప్పటిదాకా తన కెరీర్‌లో ఒక్క అరుదైన కప్పు కూడా కెరీర్‌లో గెలవలేకపోయాడు.

8 ఐసీసీ టోర్నీలు, 11 ఐపీఎల్ సీజన్లు.. వెరిసి జీరో ట్రోఫీ. డివిలియర్స్ మినహా మిగిలిన దక్షిణాఫ్రికా ప్లేయర్స్ అందరూ కూడా కనీసం తమ కెరీర్‌లో ఐపీఎల్ కప్పు గెలిచారు. కానీ డివిలియర్స్ మాత్రం ఓటములు చూసుకుంటూనే రిటైర్ అయ్యాడు. అందుకే మిస్టర్ 360 క్రికెట్ చరిత్రలోనే అన్ లక్కీయస్ట్ ప్లేయర్.




