- Telugu News Photo Gallery Cricket photos Natasha Stankovic Shares Cryptic Video Amid Divorce Rumours With Hardik Pandya
Hardik Pandya: నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? వైరలవుతోన్న లేటెస్ట్ పోస్ట్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోనున్నారని గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై అటు హార్దిక్ పాండ్యా కానీ, ఇటు నటాషా కానీ స్పందించిన దాఖలాలు లేవు.
Updated on: Jul 04, 2024 | 8:49 PM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోనున్నారని గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై హార్దిక్ కానీ, నటాషా కానీ స్పందించిన దాఖలాలు లేవు.

అయితే గతంలో హార్దిక్ తో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేసిన నటాషా మళ్లీ తిరిగి వాటిని రీట్రైవ్ చేసింది. అయితే ఈ అమ్మడి వ్యవహారం ఏ మాత్రం అంతు చిక్కడం లేదు.

తాజాగా నటాషా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పోస్ట్ ను చూస్తోంటే ఆమె హార్దిక్ తో నిజంగానే విడిపోయిందా? అన్నట్లు అనుమానం కలుగుతోంది.

జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండి తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మీరు అసలు భయపడవద్దు'.

'ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఆ భగవంతుడు మాత్రం మనకు కచ్చితంగా తోడుగా ఉంటాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు' అనే అర్థం వచ్చే పోస్ట్ షేర్ చేసింది నటాషా.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. మరోవైపు ప్రపంచకప్ గెల్చిన తర్వాత హార్దిక్ గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంపై నెటిజన్లు నటాషాన ట్రోల్ చేస్తున్నారు.




