AP High Court: ఉచిత ఇసుక పాలసీలో ముందస్తు బెయిల్‌‎ కోరిన చంద్రబాబు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయి జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని, ఉచిత ఇసుక పాలసీ ద్వారా టీడీపీ నేతలు లబ్ధి పొందారని.. తద్వారా రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని పిటిషన్ వేశారు ఏపీ సీఐడీ

AP High Court: ఉచిత ఇసుక పాలసీలో ముందస్తు బెయిల్‌‎ కోరిన చంద్రబాబు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..
Chandrababu Naidu
Follow us
Srikar T

|

Updated on: Dec 20, 2023 | 5:16 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయి జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని, ఉచిత ఇసుక పాలసీ ద్వారా టీడీపీ నేతలు లబ్ధి పొందారని.. తద్వారా రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని పిటిషన్ వేశారు ఏపీ సీఐడీ అధికారులు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు నేటితో ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. గత రెండు నెలలుగా ఈ కేసు కోర్టులో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈరోజు ఇరువైపులా పూర్తి వాదనలు విన్న ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

మన్నటి వరకూ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకున్న చంద్రబాబు రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈక్రమంలోనే ఈరోజు జరిగే నవశకం సభకు హాజరయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసిన సందర్బంగా ఉత్తరాంధ్ర జిల్లా కేంద్రంగా భారీ బహింరంగ సభ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవనున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఒకే వేదికపై చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కనిపించనున్నారు. దీంతో పార్టీ వర్గాల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..