CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.. ఈ అంశంపై సమీక్ష..

ఏపీ రాజధాని అమరావతిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది ఎన్డీయే ప్రభుత్వం. రేపు అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంపై తొలిసంతకాలు పెట్టిన సీఎం చంద్రబాబు, అదే వేగాన్ని అభివృద్దిపై కూడా పెట్టేందుకు సిద్దమయ్యారు.

CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.. ఈ అంశంపై సమీక్ష..
Cm Chandrababu
Follow us
Srikar T

|

Updated on: Jul 02, 2024 | 7:19 AM

ఏపీ రాజధాని అమరావతిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది ఎన్డీయే ప్రభుత్వం. రేపు అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంపై తొలిసంతకాలు పెట్టిన సీఎం చంద్రబాబు, అదే వేగాన్ని అభివృద్దిపై కూడా పెట్టేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం, అభివృద్దికి కలిగిన విఘాతంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి.. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేజ్‌ని విజిట్ చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి, పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు.

ఇందులో భాగంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీకి కొత్త కమిషనర్‌ను నియమించింది ప్రభుత్వం. రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్‎లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. తద్వారా అమరావతి నిర్మాణంలో కీలకంగా ముందడుగు పడినట్టయింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం జరుపుకుంటున్న 1,575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్-39 ప్రకారం గెజిట్ జారీ చేస్తూ బహిరంగ ప్రకటన చేసింది. మాస్టర్ ప్లాన్‎లోని జోనింగ్ నిబంధనలను అనుసరించి నేలపాడు, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజు పాలెం, శాఖమూరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టు తెలిపారు సీఆర్డీఏ అధికారులు. ఈ భూముల్లో పూర్తి స్థాయి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయాలు నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..