AP Curfew Timings: ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం.? ఎప్పటినుంచంటే.!
AP Curfew Relaxations: కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఇంకా తగ్గని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. సాయంత్రం 6 గంటలకు దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.
మరోవైపు మిగిలిన (అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం) జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. అలాగే రాత్రి 9 గంటలకు దుకాణాలను మూసివేయాలంది. ఈ సడలింపులు జూలై 7వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అటు పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు వచ్చేదాకా ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
కాగా, కరోనా నిబంధనలతో రెస్టారెంట్లు, జిమ్‌లు, కళ్యాణమండపాలు తెరుచుకోవడానికి జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ప్రజలందరూ తప్పనిసరిగా శానిటైజర్ వాడటంతో పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించింది. అటు థియేటర్ల అనుమతికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read:
మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!
మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!