AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అక్రమ లేఔట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారిపై ఉక్కుపాదం మోపేలా ఉత్తర్వులు..

రోజురోజుకూ పెరుగుతున్న రియల్‌ వెంచర్లు, అక్రమ లేఅవుట్ల కు చెక్  చెప్పేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది.  భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా  అనాథరైజ్డ్‌ రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh: అక్రమ లేఔట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారిపై ఉక్కుపాదం మోపేలా ఉత్తర్వులు..
Ap Government
Basha Shek
|

Updated on: Feb 19, 2022 | 3:41 PM

Share

రోజురోజుకూ పెరుగుతున్న రియల్‌ వెంచర్లు, అక్రమ లేఔట్లకు చెక్  చెప్పేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది.  భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా  అనాథరైజ్డ్‌ రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.  డీటీసీపీ అనుమతి లేని అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయవద్దని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు, లే అవుట్లను ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలకు వెనకాడొద్దని సూచించింది. కాగా ఏపీలోని కొన్ని ప్రాంతాలు అనధికార లే ఔట్లకు అడ్డాగా మారుతున్నాయి.

జిల్లా కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొందరు అక్రమదారులు ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు, లేఔట్లు ఏర్పాటు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ వ్యవహారాల్లో వీరికి కొందరు అధికారుల సహకారం కూడా అందుతోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అనధికార, అక్రమ లేఔట్ల ఫ్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. ఈక్రమంలో అనధికార లే అవుట్లకు చెక్‌పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొన్ని రోజుల క్రితం పట్టణాలు, నగరాలలో, గ్రామాలలో అక్రమ లేఔట్లను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇటీవల కలెక్టర్‌లకు, పంచాయితీ రాజ్‌ కమిషనర్లను ఆదేశించింది. తాజాగా అనధికార లేఔట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:Viral Video: పిల్లి, కుక్కల మధ్య యూనిక్ గేమ్.. ఎవరు గెలిచారంటే..

APPSC ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ.. తెలంగాణ, ఏపీ నుంచి టాప్-9 తాజా వార్తా విశేషాలు

IOC Session: 40 సంవత్సరాల తర్వాత ముంబైలో 2023 ఐఓసీ ఈవెంట్.. వేదికగా జియో వరల్డ్ సెంటర్..