చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం.. ధన్యవాదాలు తెలుపుతున్న సినీ ప్రముఖులు

కరోనా వల్ల థియేటర్లు తెరుచుకోలేక చిత్ర పరిశ్రమ చాలా నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీకి

  • uppula Raju
  • Publish Date - 5:40 am, Sat, 19 December 20
చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం.. ధన్యవాదాలు తెలుపుతున్న సినీ ప్రముఖులు

కరోనా వల్ల థియేటర్లు తెరుచుకోలేక చిత్ర పరిశ్రమ చాలా నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీకి ఊరటనిచ్చేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ ప్రకటించింది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తున్నట్లు వెల్లడించింది. మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్‌ ప్యాకేజీకింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ మోహన్ రెడ్డికి, మంత్రి మండ‌లికి పలువురు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఆదుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎందరో కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు వేల మంది లబ్ధి పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయం ఎనలేనిదని న ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనియాడారు. పరిశ్రమ పునఃప్రారంభానికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఉత్తేజాన్నిస్తాయని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. సరైన సమయంలో పరిశ్రమకు చేయూతనిచ్చిన జగన్‌కి ధన్యవాదాలు తెలిపింది ఎస్వీసీసీ సంస్థ. తెలుగు సినీ పరిశ్రమకి చేయూతనిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి సురేష్‌ ప్రొడక్షన్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.