AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో తాగుబోతు వీరంగం.. కరెంటు పోల్ ఎక్కి హల్ చల్.. కిందికి దింపి స్టేష‌న్‌కు తరలించిన పోలీసులు

విజయవాడ నగర శివారులోని రాజీవ్ నగర్ లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో హైటెన్ష‌న్‌ కరెంటు పోల్ ఎక్కిన తాగుబోతు హల్ చల్ సృష్టించాడు. దీంతో స్థానికులు...

విజయవాడలో తాగుబోతు వీరంగం.. కరెంటు పోల్ ఎక్కి హల్ చల్.. కిందికి దింపి స్టేష‌న్‌కు తరలించిన పోలీసులు
Subhash Goud
|

Updated on: Dec 19, 2020 | 6:34 AM

Share

విజయవాడ నగర శివారులోని రాజీవ్ నగర్ లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో హైటెన్ష‌న్‌ కరెంటు పోల్ ఎక్కిన తాగుబోతు హల్ చల్ సృష్టించాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పి పోల్ నుంచి కిందికి దింపేలా చేశారు. మైక్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి కిందికి దింపిన పోలీసులు అతన్ని స్టేషన్ తరలించారు. తాగుబోతు స్థానికంగా ఉండే రిక్షాపుల్లర్ సుబ్బారావుగా గుర్తించారు. తాగిన మత్తులో ఉన్న సుబ్బారావును విచారిస్తున్నారు.