AP Eamcet Counselling: ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం… రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి నుంచి మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఎంసెట్‌ పరీక్షలో..

AP Eamcet Counselling: ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం... రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2021 | 1:58 PM

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి నుంచి మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఎంసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సెట్లో లాగిన్‌ అయ్యి నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ నెల 31 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, ఫీజు చెల్లింపులు కూడా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో పాటే సమాంతరంగా కొనసాగుతాయని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు సమీపంలోని ఏపీ ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ సెంటర్లకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ మొదటి దశ షెడ్యూల్‌ ఇలా.. 1.నేటి నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది. 2.అక్టోబర్‌ 26 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. 3. నవంబర్‌ 1 నుంచి 5 వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 4. అదేవిధంగా 1 నుంచి 6 వరకు సేవ్‌ చేసిన ఆప్షన్లలో మార్పులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. 5. నవంబర్‌ 10 న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 6.నవంబర్‌ 10-15 మధ్యలో విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. 7.నవంబర్‌ 15 నుంచి తరగతులు మొదలవుతాయి. ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే… 1.విద్యార్థులు ముందుగా ఏపీ ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ లోకి లాగిన్‌ అవ్వాలి. 2.హోమ్‌ పేజీలోని ‘Forms’ ఆప్షన్ కింద ఉన్న ‘Candidate Registration’ మీద క్లిక్‌ చేయాలి. 3.అక్కడ ఎంసెట్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి. 4. ఆ తర్వాత సంబంధిత సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసి వెబ్‌ ఆప్షన్లను ఎంచుకోవాలి. 5.ఆపై రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. చివరగా ఫైనల్‌ సబ్మిట్‌ బటన్‌ నొక్కి ప్రింట్‌వుట్‌ కాపీ తీసుకోవాలి. ఇది కేవలం మొదటి దశ కౌన్సెలింగ్‌కు సంబంధించినది మాత్రమే. ఇందులో మిగిలిన సీట్లు, అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రెండో దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.

Also Read:

 ఆర్బీఐ కీలక నిర్ణయం..! పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గిస్తుందా.. పెంచుతుందా..?

 మనోడి డ్రైవింగ్ ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. చూస్తే వావ్ అనాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

Plastic particles: ఆవుల శరీరాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు.. మానవులకు చేరితే ప్రమాదం తప్పదట!