AP EAMCET Results: ఇవాళే ఏపీ ఎంసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి..
AP EAMCET Results 2023: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2023 పరీక్ష ఫలితాలు జూన్ ఇవాళ విడుదలకానున్నాయి. బుధవారం (జూన్ 14)న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఫలితాలను జేఎన్‌టీయూ అనంతపూర్ విడుదల చేయనున్నట్లు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి..
విజయవాడ, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ముగిసన తరువాత ఈఏపీసెట్ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు.
మే 24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫలితాలతోపాటు, తుది ఆన్సర్ కీ కూడా విడుదల చేస్తారు. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీటు కేటాయింపులు ఉంటాయి.
అనంతపురం జేఎన్‌టీయూ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3,37,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం