AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: హర్షించదగ్గ విషయం.. మోదీకి మద్దతుగా నిలవాలి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్..

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని.. మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమంటూ పవన్‌కల్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Operation Sindoor: హర్షించదగ్గ విషయం.. మోదీకి మద్దతుగా నిలవాలి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2025 | 1:36 PM

Share

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్.. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో 30మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 100 మంది మరణించినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5.. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది. కాగా.. ఆపరేషన్‌ సింధూర్‌ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. రివెంజ్ అదిరింది అంటూ .. ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని.. మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమంటూ పవన్‌కల్యాణ్ వివరించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో ధీటుగా బదులిచ్చామని… భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అంతా దేశానికి అండగా ఉండాలి.. ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలంటూ కోరారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దు.. దేశ భద్రత విషయంలో.. ఇన్‌ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కోరారు. లేకపోతే చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారని.. కొందరు పాక్‌కు అనుకూలంగా మాట్లాడారని.. వారిని ఉద్దేశించే గతంలో మాట్లాడనంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాల్సిందేనన్నారు.

ఏపీలో ఇద్దరు మరణించారు.. హిందువులా కాదా అని అడిగి మరి చంపారని పవన్ కల్యాణ్ అన్నారు. 90లో కూడా కశ్మీర్ పండిట్లపై కూడా దాడి జరిగింది.. హిందువులపై దశాబ్దాలుగా దాడి జరుగుతునే ఉందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని.. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైన దేశాన్ని కించపరిచేలా మాట్లాడితే కేసులు పెట్టాల్సిందేనన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదన్నారు. ఇలాంటి సమయంలో అందరం దేశం కోసం ఆలోచించాలి, పార్టీల కోసం కాదన్నారు. పాకిస్థాన్ కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

ఏపీలో తీర ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలి.. ఏపీకి కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను..ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి.. పాకిస్తాన్ కి ప్రోత్సాహంగా మాట్లాడడం.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ చేసుకుంటే మంచిది అని సూచించారు. గాంధీ మార్గం అని చెప్పి సహనం సహనమని చెప్పి.. హిందువులను చంపితే భరించాలా.. అంటూ పవన్ ప్రశ్నించారు.