Prakasam District: అధ్యాపకుడి వికృత చేష్టలు! ఫోన్‌లో అసభ్య ఫొటోలు తీసి.. ఆపై బెదిరింపులు, అత్యాచారం

పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పవలసిన ఓ అధ్యాపకుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడాడు. తన వద్ద విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఓ విద్యార్థినిపై కన్నేసి వికృత చేష్టలకు ఒడిగట్టాడు. ఫోన్‌లో బాలిక ఫొటోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన బాలికపై మళ్లీ దాడికి దిగి అబార్షన్‌ చేయించుకోవల్సిందిగా..

Prakasam District: అధ్యాపకుడి వికృత చేష్టలు! ఫోన్‌లో అసభ్య ఫొటోలు తీసి.. ఆపై బెదిరింపులు, అత్యాచారం
Teacher Accused Of Molesting Inter Student
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 11, 2023 | 4:47 PM

యర్రగొండపాలెం, అక్టోబర్ 11: పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పవలసిన ఓ అధ్యాపకుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడాడు. తన వద్ద విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఓ విద్యార్థినిపై కన్నేసి వికృత చేష్టలకు ఒడిగట్టాడు. ఫోన్‌లో బాలిక ఫొటోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన బాలికపై మళ్లీ దాడికి దిగి అబార్షన్‌ చేయించుకోవల్సిందిగా బెదిరించాడు. ఈ దుర్మార్గుడి బుద్ధిని బాలిక పోలీసుల ఎదుట బయటపెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఓ విద్యార్థిని గతేడాది ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరింది. అదే కాలేజీలో యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్‌ నాయక్‌ అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమై ఓ కుమారుడు కూడా ఉన్నారు. రోజూ విద్యార్ధినిని ఇంటి వద్ద దించే నెపంతో మాయమాటలు చెప్పాడు. అలా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన గోవింద్‌ ఓ రోజు నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విద్యార్ధినిని అసభ్యకరంగా తన సెల్‌ ఫోన్‌లో ఫొటోలు తీశాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆమెను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో భయందోళనలకు గురైన సదరు విద్యార్థిని ఇంటర్‌ రెండో ఏడాది వేరే కాలేజీలో చదివేందుకు వెళ్లిపోయింది.

వేరే కాలేజీకి మారినీ గోవింద్‌ నాయక్‌ తన వికృత చేష్టలు మానలేదు. తన ఫోన్‌లో విద్యార్ధిని అసభ్య ఫొటోలు ఉన్నాయని, ఇతరులకు వాటిపి చూపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్ధిని గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన నిందితుడు ఆబార్షన్‌ చేసుకోవాలని బెదిరించడాడు. విద్యార్ధిని అందుకు అంగీకరించకపోవడంతో దాడిక తెగబడ్డాడు. బాలికను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక కడుపుపై దెబ్బలు ఉండటం చూసి గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు అధ్యాపకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.