AP Corona: ఏపీలో మళ్లీ వంద మార్క్ దాటిన కరోనా కేసులు.. ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..?

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు సంఖ్య నిత్యం పెరుగుతోంది. ఇటీవల వంద మార్క్ దాటిన కేసులు నిన్న తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వందమార్క్...

AP Corona: ఏపీలో మళ్లీ వంద మార్క్ దాటిన కరోనా కేసులు.. ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..?
AP corona
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2021 | 6:03 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు సంఖ్య నిత్యం పెరుగుతోంది. ఇటీవల వంద మార్క్ దాటిన కేసులు నిన్న తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వందమార్క్ దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,90,884 కి పెరిగింది. దీంతోపాటు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7176 కి చేరింది.

కాగా.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 89 మంది కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటివరకు వైరస్‌ నుంచి 8,82,670 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,038 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 45,079 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,43,07,165 నమూనాలను పరీక్షించారు.

రోజురోజుకూ.. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం  అప్రమత్తమైంది. మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

Eluru Municipal Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో