గుంటూరులో సీఐ డెత్ మిస్టరీలో విభిన్న కోణాలు.. సీసీ ఫుటేజ్ సాయంతో కాస్త స్పష్టత.. వివరాలు ఇవే
గుంటూరులో సీఐ డెత్ మిస్టరీలో విభిన్న కోణాలు వెలుగుచూస్తున్నాయి. ముందునుంచి సీఐది అనుమానాస్పద మరణమనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులో సీఐ డెత్ మిస్టరీలో విభిన్న కోణాలు వెలుగుచూస్తున్నాయి. ముందునుంచి సీఐది అనుమానాస్పద మరణమనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సీసీ ఫుటేజ్‌లో నమోదైన దృశ్యాలతో కొంతమేర స్పష్టత వచ్చింది. నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న సీఐ శేషారావు గుంటూరు జిల్లాలో ఉన్న ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సీఐ మరణించారు. సీఐ మృతికి గల కారణాలపై పట్టాభిపురం పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే, సీఐ శేషారావు మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. బిల్డింగ్ మెట్లపై నుంచి జారిపడడంతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలోనూ ఆ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే ఆ టైంలో చీపురు పట్టుకుని ఎందుకు వెళ్లాడు. కారణం ఏంటన్నది ఒకటైతే.. నిజంగా ప్రమాదవశాత్తే పడ్డాడా.. అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీసీ ఫుటేజ్ సాయంతో కొంత క్లారిటీ వచ్చినట్లైంది.
సీఐ శేషారావు మృతికి ఓ బల్లి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. చీపురు కర్రతో గోడపై బల్లిని బెదిరించే సమయంలో రెండవ అంతస్తుపై నుంచి ఆయన పడిపోయాడని సమాచారం. అయితే కుటుంబ సభ్యుల వెర్షన్ మరోలా ఉంది. సీఐ కొన్నిరోజులుగా ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఆ మహిళ ఇంట్లోనే అతను చనిపోయాడు. గతంలో ఆ మహిళ చేసిన అక్రమాల మూలంగానే సీఐ శేషారావు జైలుకు కూడా వెళ్లివచ్చాడని చెబుతున్నారు. సీఐ పడిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. అంతకుముందు ఇంట్లో నుంచి సీఐతో పాటు ఆ మహిళ కూడా బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లిపోగా.. సీఐ ఒక్కడే చీపురు పట్టుకుని మెట్లపైకి వెళ్లి పడిపోయాడు. కాసేపటి తర్వాత కానీ సీఐ పడిపోయిన విషయాన్ని గుర్తించలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఆ మహిళ కుటుంబసభ్యుల ప్రవర్తనపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సీఐ శేషారావు మృతిపై ఉన్నతాధికారులు లోతైన విచారణ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read:
దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు
స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా