CM Jagan Letter to PM Modi: మరోసారి ప్రధానికి ఏపీ సీఎం లేఖ.. ఈ సారి కూడా అదే అంశం.. కానీ 14 పేజీలు..
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతోంది. ప్రధానమంత్రికి మరో లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కృష్ణాజలాల్లో తెలంగాణ నీటి వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారాయన.
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతోంది. ప్రధానమంత్రికి మరో లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కృష్ణాజలాల్లో తెలంగాణ నీటి వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారాయన. KRMB పరిధిని నోటిఫై చేయాలిని కోరారు. వెంటనే ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద CISF బలగాలు మోహరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. వెంటనే కేంద్ర జలశక్తి మంత్రి కల్పించుకోవాలన్నారు. తెలంగాణకు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేయాలని ప్రధానిని ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి జగన్ కోరారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ఆ లేఖలో.. ‘‘ తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా.. జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోంది. అంటూ మొత్తం 14 పేజీలతో కూడా ఉత్తరాన్ని ప్రధానికి పంపించారు.
గతంలో… తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావాత్‌కు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు విడివిడిగా లేఖలు రాశారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, నీటి వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై 4 పేజీలతో లేఖ రాశారు. శ్రీశైలంలో 834 అడుగులకు కింద నీటి మట్టం ఉన్నా ఉత్పత్తి ఆపడం లేదని, కృష్ణా బోర్డు చెప్పినా వినడం లేదని తెలంగాణపై ఫిర్యాదు చేశారు.
విభజన చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోందని, ఆ రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్ట్‌లను, నీటి వాడకాలను పరిశీలించిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ను KRMB సందర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కోరారు సీఎం జగన్. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ప్రకాశ్ జవదేవకర్‌కు లేఖ రాశారు ముఖ్యమంత్రి