Pakistan: కుక్క తోక, పాకిస్తాన్ బుద్ధి ఒక్కటే! సరిహద్దులో మళ్లీ అదే పని చేస్తోంది..
Pakistan setting LoC: పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. తన తోక జాడింపులు ఆపడం లేదు. విష బీజాలు నాటేందుకు ట్రెండ్ మార్చింది. ఇక టెక్నాలజీని వినియోగిస్తోంది. డ్రోన్లు ఎంట్రీ ఇవ్వకుండా జామర్లు పెట్టడంతో.. ఇప్పుడు మరో ఎత్తు వేసేందుకు ప్లాన్..
పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. తన తోక జాడింపులు ఆపడం లేదు. మన దేశంలో విష బీజాలు నాటేందుకు ట్రెండ్ మార్చింది. ఇక టెక్నాలజీని వినియోగిస్తోంది. డ్రోన్లు ఎంట్రీ ఇవ్వకుండా జామర్లు పెట్టడంతో.. ఇప్పుడు మరో ఎత్తు వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఎంటా ఎత్తుగడ..? జమ్ము- కశ్మీర్ లో ఈ ప్రభావం ఎంత వరకూ ఉంటుంది? గత వారం జమ్మూలో డ్రోన్ దాడులు.. ఇవాళ.. కశ్మీర్ కు అందుబాటులో.. బోర్డర్ లో సెల్ టవర్ల నిర్మాణం .. ప్రపంచమంతా అభివృద్ధిలో అంతరిక్షం వైపు చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం.. భారత్.. దాని సరిహద్దుల మీద గురి పెడుతూ పబ్బం గడుపుకుంటోంది.
ఇన్నాళ్ల పాటు ముష్కరులను సరిహద్దులు దాటిస్తూ.. తన దాడులు ముమ్మరం చేసిన పాకిస్తాన్.. ఆ తర్వాత తన పంథా మార్చింది.. కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం వాడే యత్నం చేస్తోంది.. జమ్ములో డ్రోన్ దాడుల హంగామా క్రియేట్ చేయడంతో ఆపకుండా.. సరిహద్దులో సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.
కశ్మీర్‌లో ఏదైనా అల్లర్లు చెలరేగినపుడు ఇక్కడి ఇంటర్నెట్ సేవలను ఆపేస్తుంది మన ప్రభుత్వం. దీంతో స్థానిక ముష్కర మూకల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. తద్వారా.. అలజడులు ముమ్మరం కాకుండా ఆపే యత్నం చేస్తుంటారు. ఈ లోటు పాట్లను గుర్తించిన పాక్ ప్రభుత్వం- కశ్మీర్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఈ హై సిగ్నల్ టవర్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నెట్ వర్క్ మన సరిహద్దు ప్రాంతాలతో పాటు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనూ పని చేస్తుంది.
ఈ సెల్ టవర్లను.. పాకిస్థాన్ స్పెషల్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థ పీఓకే, గిల్గిత్, బాలిస్థాన్ లలో కూడా కమ్యూనికేషన్ వ్యవహారాలను చూస్తోంది. ఈ సంస్థ అధ్వర్యంలో 38 చోట్ల ఏర్పాటు చేసిన ఈ సెల్ టవర్ల ద్వారా.. జమ్ము కశ్మీర్ ప్రాంతాలకు పాక్ టీవీ సిగ్నళ్లు అందే అవకాశముంది. వీటి ద్వారా కశ్మీరీల్లో భారత వ్యతిరేక భావజాలం నూరిపోసేలా తెలుస్తోంది.