ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే
సీఎం జగన్ జాతీయ స్థాయిలో తన మార్క్ చాటుకుంటున్నారు. జాతీయ సంస్థలు చేసే సర్వేల్లో గవర్నెన్స్ పరంగా సత్తా చూపిస్తున్నారు. తాజాగా జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఏపీ సీఎం జగన్...
ABP-C Voter Survey: సీఎం జగన్ జాతీయ స్థాయిలో తన మార్క్ చాటుకుంటున్నారు. జాతీయ సంస్థలు చేసే సర్వేల్లో గవర్నెన్స్ పరంగా సత్తా చూపిస్తున్నారు. తాజాగా జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఏపీ సీఎం జగన్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ‘దేశ్ కా మూడ్’ పేరుతో ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఈ సర్వేను నిర్వహించింది. ప్రభుత్వాల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సేకరించింది. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు, మేనిఫెస్టోలోని అంశాలు, ఎన్నికల హామీలు సహా స్మార్ట్ గవర్నెన్స్, ఇ-గవర్నెన్స్.. వంటి కీలక అంశాలపై ప్రజల నాడి తెలుసుకుంది. సీఎం వ్యవహార శైలినీ కూడా ఇందులో ప్రధానాంశంగా పరిగణించారు. ప్రజల నుంచి వచ్చే సంతృప్తీకరణను ఆధారంగా చేసుకుని స్థానాలు కేటాయించారు. 543 లోక్‌సభ స్థానాల్లో దాదాపు 30 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను 12 వారాల పాటు సంస్థ సేకరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందుతున్నాయనే విషయం తమ సర్వేలో తేలినట్లు వివరించింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొంది.
ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు ఆయన పరిపాలనను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. నాలుగవ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అయిదవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఉన్నారు.
Many Congratulations to the people of Odisha in the State, across India and abroad as our State’s Hon’ble CM Shri. Naveen Patnaik is yet again hailed as the Best Chief Minister of India. INDIA and the World has and will always acknowledge his simplicity and greatness. pic.twitter.com/tZkUUWmcHO
— Dr. Sasmit Patra I ଡ଼ଃ ସସ୍ମିତ ପାତ୍ର (@sasmitpatra) January 15, 2021
Also Read: