AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan Vs YSRCP Leaders: సమాధానం చెబితే మాపై దాడులు చేయిస్తారా? పవన్‌పై శ్రీకాంత్ రెడ్డి ధ్వజం

బద్వేల్ ఎన్నికలో గెలుస్తామని ధైర్యంగా చెప్పే దమ్ము పవన్‌కి ఉందా..? అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పవన్ కల్యాణ్.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు.

Pawan Kalyan Vs YSRCP Leaders: సమాధానం చెబితే మాపై దాడులు చేయిస్తారా? పవన్‌పై శ్రీకాంత్ రెడ్డి ధ్వజం
AP Chief Whip Srikanth Reddy
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2021 | 7:15 PM

Share

Pawan Kalyan Vs YSRCP Leaders: బద్వేల్ ఉపఎన్నికలో గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బద్వేల్ వైసీపీ కంచుకోట..ఈ ఎన్నికతో మరోసారి రుజువు కాబోతోందన్నారు. బద్వేల్ ఎన్నికలో గెలుస్తామని ధైర్యంగా చెప్పే దమ్ము పవన్‌కి ఉందా..? అని ప్రశ్నించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పవన్ కల్యాణ్.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజకీయ లబ్ది కోసమే పవన్ ప్రతీసారి కులాలు, మతాల ప్రస్తావన తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పై ద్వేషం, ఈర్ష్యతో పవన్ మాట్లాడుతున్నాడని.. పవన్ కడుపు మంటకి మందు లేదని ఎద్దేవా చేశారు.

ప్రజా బలం వైసీపీకి ఉందన్న శ్రీకాంత్ రెడ్డి.. ప్రజా బలం ఉన్నంత వరకూ మీరెన్ని కుట్రలు చేసినా ఏమి చెయ్యలేరని అన్నారు. ఇకపైన అయినా పవన్ తన దుర్మార్గపు ఆలోచన మానుకోవాలన్నారు. మమ్మల్ని ఏమైనా తిట్టొచ్చా..? మేము సమాధానం చెబితే దాడులు చేయిస్తారా..? అంటూ ప్రశ్నించారు. పోసాని ఇంటిపై దాడి చేశారని.. మంత్రి పేర్ని నాని కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు డైరెక్టర్ లోనే పవన్, మనోహర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. పవన్ బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని.. ప్రజల కోసం అందరిని బరిస్తామని వ్యాఖ్యానించారు. అధిక వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయి.. త్వరలో పాడైన రోడ్లను సరిచేస్తామన్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు శ్రీకాంత్ రెడ్డి కౌంటర్..

Also Read..

Megastar Chiranjeevi : మేనల్లుడి హెల్త్ ఆప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. మీ ఆశీస్సులు కావాలంటూ ట్వీట్..

Kodali Nani on Pawan: జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని సవాల్

Pawan Kalyan vs YSRCP: టీడీపీ – జనసేన కలిసే ఉన్నాయి.. పవన్ కల్యాణ్‌పై మంత్రి మేకతోటి విమర్శలు