CM Jagan: సీఎం వైఎస్ జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు.. ఢిల్లీ టూర్ వివరాలు ఇవే..
Niti Aayog Governing Council Meeting: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం, ఆదివారం సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్.. ఇక్కడి నుంచి ఢిల్లీ పర్యటకు బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం. మధ్యాహ్నం 3.40కి ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం జగన్.
ఇక సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి శంషాబాద్ చేరుకుంటారు. 6.55 కు నార్సింగి ఓమ్ కన్వెన్షన్‌లో జీవీ.ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. రాత్రి 7.50కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. 9.15 – 4.30 వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరగనున్న నీనీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడవ సమావేశంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఇక సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..