Andhra Pradesh: సర్కారు ఆఫీసులకే షాకిచ్చిన విద్యుత్ శాఖ.. ఎంత మొత్తుకున్న వినని అధికారులు.. అసలేమైందంటే..

Ongole Circle: చిర్రెత్తుకొచ్చిన విద్యుత్‌ శాఖ అధికారులు తమ పవర్‌ కట్‌ టూల్స్‌తో రంగంలోకి దిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా 392 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు పడ్డాయి. అత్యధికంగా RWS ఆఫీస్.. 112 కోట్లు..

Andhra Pradesh: సర్కారు ఆఫీసులకే షాకిచ్చిన విద్యుత్ శాఖ.. ఎంత మొత్తుకున్న వినని అధికారులు.. అసలేమైందంటే..
Power Cut
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 3:04 PM

కరెంట్ బిల్లులు (Power Bills)వెంటనే కట్టండీ లేకుంటే సరఫరా కట్ చేస్తాం. బిల్లు చెల్లించకపోతే కరెంట్‌ను నిలిపి వేస్తామని వినియోగదారులను హెచ్చరించారు. అయితే తామ హెచ్చరికలు సామాన్యుడికైనా.. అధికారికైనా ఒకే సూత్రాన్ని పాటిస్తున్నారు. అంతే కాదు ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికి కరెంట్ నిలిపివేశారు. కట్టండి ప్లీజ్..!అంటూ అధికారులతో ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా వినిపించుకున్న పాపాన పోలేదు. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ ఉద్యోగులు.. ఆ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ కట్ చేశారు. వారు కట్టాల్సింది.. వందలు, వేలు, లక్షలు కాదు.. చెల్లించాల్సి విద్యుత్ బిల్లులు కోట్లలో ఉండటంతో ఇలా చర్యలు తీసుకున్నారు.

ఒంగోలులో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ శాఖ అధికారులు(APCPDCL) షాక్‌ ఇచ్చారు. నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు కట్టకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేశారు. ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 10వ తేదీ లోపు విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తే.. సర్‌చార్జి మినహాయిస్తామని నెలరోజుల నుంచి నోటీసులు జారీ చేసి మరీ చెబుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన విద్యుత్‌ శాఖ అధికారులు తమ పవర్‌ కట్‌ టూల్స్‌తో రంగంలోకి దిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా 392 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు పడ్డాయి. అత్యధికంగా RWS ఆఫీస్.. 112 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ 90 కోట్లు, ఇరిగేషన్‌ శాఖ 100 కోట్లు, మున్సిపాలిటీలు 13 కోట్లు, విద్యాశాఖ 7 కోట్లు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ చెప్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?