Kesineni Nani: పార్టీ అధినేత ముందే కేశినేని నాని అసహనం.. ఎంపీ ప్రవర్తనతో అవాక్కయిన చంద్రబాబు

పార్టీ అధినేత ముందే కేశినేని నాని అసహనం ప్రదర్శించారు. ఆయన ప్రవర్తనతో చంద్రబాబు షాకయ్యారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Kesineni Nani: పార్టీ అధినేత ముందే కేశినేని నాని అసహనం.. ఎంపీ ప్రవర్తనతో అవాక్కయిన చంద్రబాబు
Kesineni Nani
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 07, 2022 | 8:36 AM

Andhra Pradesh: విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినాని నాని వ్వవహారశైలి వివాదాస్పదమవుతుంది. అప్పుడెప్పడో సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీకి చురకలు అంటిస్తూ చెలరేగిపోయారు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు.. అయతే పార్టీలో కాదండోయ్ వివాదాల్లో. అవును కేశినేని నాని సోదరుడు చిన్ని కూడా ప్రజంట్ విజయవాడ పాలిటిక్స్‌లో కీ రోల్ పోషిస్తున్నారు. ఆయన్ను అధిష్ఠానం ఎంకరేజ్ చేస్తుందని.. ఈ సారి తన సీటుకు ఎసరు వస్తుందని నాని భావిస్తున్నారు. దీంతో తమ్ముడితో నేరుగానే వార్‌కి దిగారు. తన ఎంపీ స్టిక్కర్ వినియోగిస్తున్నాడంటూ సోదరుడిపై కేసు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే అధినాయకత్వంపై తన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు అంతా తెరవెనకే జరిగినా.. ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన అధినేత చంద్రబాబు(Chandrababu)ను పార్టీ సీనియర్ నేతలు కలిశారు. ఈ క్రమంలో వారంతా చంద్రబాబుకు నాని చేతుల మీదగా పుష్పగుచ్చం ఇచ్చే ప్రయత్నం చేశారు గల్లా జయదేవ్. నాని అందుకు నిరాకరించారు. మీరే ఇవ్వండి అన్నట్లుగా కనీసం దాన్ని ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు.  పార్టీ అధినేత ముందే కేశినేని నాని అసహనం ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  నాని చర్యతో  చంద్రబాబు అవాక్కయ్యారు.

ఇటీవల మాట్లాడుతూ తన సోదరుడితో విభేదాలు ఇప్పుడు కాదు.. గత 30 ఏళ్ల నుంచి ఉన్నాయన్నారు కేశినేని చిన్ని. విజయవాడ ఎంపీగా గెలిచే సత్తా తనకుందన్నారు. అది వెన్నుపోటు మాత్రం కాదన్నారు. కేశినేని నాని కన్నా..తనకు చంద్రబాబే ముఖ్యమన్నారు. ఇది అన్నదమ్ముల పోరా… అధిష్టానం ప్లానా? అనేది తేల్చుకోలేక తెలుగు తమ్ముళ్లు కొందరు సైలెంట్‌గా ఉన్నారట. తాజా ఘటన తరువాత ఏం జరుగుతోందో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..