‘3 రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండి’.. జగన్‌పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!

ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఓ డైరెక్టర్ జగన్‌పై సెటైర్స్ వేశారు. మూడు రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండంటూ.. సెన్సేషనల్ కామెంట్స్..

'3 రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండి'.. జగన్‌పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 24, 2020 | 2:49 PM

AP 3 Capital Issue: దేశవ్యాప్తంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజధానుల అంశం కీలకంగా మారింది. ఇప్పటికే వైజాగే రాజధాని అని జగన్ ప్రకటించినా.. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. దీనికి సంబంధించి పలు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం. అయితే తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఓ డైరెక్టర్ జగన్‌పై సెటైర్స్ వేశారు. మూడు రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

గతకొద్ది రోజుల నుంచీ ఏపీలో మూడు రాజధానుల అంశం పెద్ద చర్చనే తీసుకొస్తుంది. దీనికి సంబంధించి 3 క్యాపిటల్ ఇష్యూ జగన్‌కు తలనొప్పి తీసుకొచ్చింది. అలాగే.. అమరావతిలో గత 50 రోజుల నుంచి రైతులు కూడా ఏకథాటిగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటివరకూ టాలీవుడ్‌ నుంచి మాత్రం ఏపీ గురించి ఎవరూ ప్రత్యేకంగా మాట్లాడలేదు. అందరూ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ తమ్మరెడ్డి భరద్వాజ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తాజాగా.. ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన ‘3 కాకపోతే.. 30 రాజధానులు పెట్టుకోండంటూ.. ఆంధ్రప్రదేశ్ సీఎంపై సెటైర్లు వేశారు. ఎక్కడి నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందన్నారు. మరి కొత్తగా పేరు పెర్లు పెట్టినంత మాత్రాన పాలన ఆగిపోదుకదా అన్నారు. అలాగే మంచికో, చెడుకో అమరావతి రాజధానంటూ ప్రకటించారు. ఇప్పటికే ఆ ప్రాంతంపై వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో 2 వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త రాజధానులంటే ప్రజలకు నష్టం కలిగి అవకాశం ఉందని’ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు.

ఇదీ చదవండిడైరెక్టర్ రాజమౌళికి గూగుల్ షాక్