Road accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 37మందికి గాయాలు
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్ బస్సు 16వ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద బోల్తా పడింది. ముందు వెళ్తున్న పోగాకు లోడు
Road accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు 16వ నంబర్ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద బోల్తా పడింది. ముందు వెళ్తున్న పొగాకు లోడు ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అవతల వైపు రోడ్డుపై బోల్తా పడింది.
కాగా.. బస్సులోని ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యడ్లపాడు ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.