Trump Tweets In Hindi: హిందీలో ట్వీట్ చేసిన ట్రంప్.. ‘మరికొన్ని గంటల్లో అందర్నీ కలుస్తా’..!
భారత పర్యటనకు బయలుదేరేముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ లో హిందీలో ట్వీట్ చేయడం విశేషం. 'ఇండియాను విజిట్ చేయడంపట్ల నేనెంతో ఆసక్తిగా ఉన్నాను. .మేము మధ్య దారిలో ఉన్నాం.. కొన్ని గంటల్లో అందరినీ కలుస్తాం' అని ఆయన పేర్కొన్నారు. కొద్ది సేపట్లో ట్రంప్ దంపతులు .
Trump Tweets In Hindi: భారత పర్యటనకు బయలుదేరేముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ లో హిందీలో ట్వీట్ చేయడం విశేషం. ‘ఇండియాను విజిట్ చేయడంపట్ల నేనెంతో ఆసక్తిగా ఉన్నాను. .మేము మధ్య దారిలో ఉన్నాం.. కొన్ని గంటల్లో అందరినీ కలుస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. కొద్ది సేపట్లో ట్రంప్ దంపతులు భారత్ చేరుకోనున్నారు. 36 గంటల తన భారత పర్యటనలో ట్రంప్ ఎక్కువగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గడపనున్నారు. అటు-ట్రంప్ గత రాత్రి చేసిన ట్వీట్ కు మోడీ కూడా ట్వీట్ చేస్తూ.. మీ రాకకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని అన్నారు. మీ పర్యటన వల్ల ఉభయదేశాల సంబంధాలు మరింత దృఢతరమవుతాయని ఆశిస్తున్నామని, త్వరలో మిమ్మల్ని అహ్మదాబాద్ లో కలుసుకుంటామని మోడీ తెలిపారు.
కాగా… ఇండియాకు ట్రంప్ దంపతులు వఛ్చిన వెంటనే మోడీ.. వారిని సబర్మతీ ఆశ్రమానికి తీసుకువెళ్తారని, అక్కడి విశేషాలను తెలియజేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते में हैँ, कुछ ही घंटों में हम सबसे मिलेंगे!
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020