డైరెక్టర్ రాజమౌళికి గూగుల్ షాక్
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు గూగుల్ డైరెక్టర్ రాజమౌళికి షాక్ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి డైరెక్టర్ ఎవరని కొడుతుంటే.. రాజమౌళి పేరుతో పాటుగా, సంజయ్ పాటిల్ అనే పేరు..

దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సాధించారు. ‘ఈగ’ చిత్రంతోనే తెలుగు సినిమా వాల్యూ ఏంటో చాటి చెప్పిన రాజమౌళి.. ‘బాహుబాలి’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించారు. కాగా ప్రస్తుతం ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ‘అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు’ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లుక్స్ ఫుల్ బజ్‌ని క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.
కాగా.. ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు గూగుల్.. డైరెక్టర్ రాజమౌళికి షాక్ ఇస్తోంది. ‘ఆర్ఆర్ఆర్ సినిమాకి డైరెక్టర్ ఎవరని కొడుతుంటే.. రాజమౌళి పేరుతో పాటుగా, సంజయ్ పాటిల్’ అనే పేరు కూడా వస్తోంది. ‘మరి సంజయ్ పాటిల్ ఎవరి కొడుతుంటే మాత్రం ఏం చూపించడం లేదు’. మరి ఈ సంజయ్ పాటిల్ ఎవరనేది గూగుల్‌కే తెలియాలి. ఏదేమైనా ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇది కాస్త రాజమౌళికి షాక్ అనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: ఒక్కరు ప్రయాణించడానికి.. పెద్ద కారు అవసరమా?