Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

ఒక్కరు ప్రయాణించడానికి.. అంత పెద్ద కార్లు అవసరమా?

ఒక్కరు ప్రయణించడానికి దాదాపు 1,500 కేజీల బరువున్న కారును ఉపయోగిస్తున్నారన్నారు మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా. 60 నుంచి 70 కేజీల బరువున్న ఒక వ్యక్తి 1,500 కేజీల బరువున్న కారును ప్రతీ రోజు నిత్యవసరాలకు ఉపయోగిస్తున్నారని..
One Indian weighing 70 kg uses 1500-kg car, ఒక్కరు ప్రయాణించడానికి.. అంత పెద్ద కార్లు అవసరమా?

ఒక్కరు ప్రయణించడానికి దాదాపు 1,500 కేజీల బరువున్న కారును ఉపయోగిస్తున్నారన్నారు మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా. 60 నుంచి 70 కేజీల బరువున్న ఒక వ్యక్తి 1,500 కేజీల బరువున్న కారును ప్రతీ రోజు నిత్యవసరాలకు ఉపయోగిస్తున్నారని, దీని వల్ల వనరులు వృధా అవుతున్నాయన్నారు. అలాగే ఆటోమొబైల్ పరిశ్రమలో ఎక్కువగా కాలుష్యం ఉన్న సంగతి కూడా ఆయన అంగీకరించారు. అయితే ఒక వ్యక్తి ప్రయాణించడానికి పెద్దకారు అవసరం లేదని, అందుకే అతి తక్కువ బరువైన టాటా నానోను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే టాటా కారులో ఎక్కువగా కాలుష్యం ఉన్న కారణంగా, అది సరిగ్గా పనిచేయలేదన్నారు.

ఒక వ్యక్తి కారులో ప్రయాణించడానికి వీలుగా, అనుకూలంగా ఉండేలా.. ఒక చిన్న కారును విడుదల చేస్తున్నామని, త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం విడుదల చేయబోయే చిన్న కారులో 7 శాతం కార్బన్ డాయాక్సైడ్, 2.5 పీఎంలోని ఐదవ భాగాన్ని అందిస్తాయన్నారు. దీంతో.. కాలుష్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుదని చెప్పారు. కాగా.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా పనులు జరుగుతున్నాయన్నారు. బ్యాటరీలు, ఛార్జింగ్ ద్వారా నడిచే బైక్, ఆటోలను తీసుకురానున్నట్లు గోయెంకా తెలిపారు.

అయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ల విషయానికొస్తే భారత దేశం చైనా కంటే ఐదేళ్లు వెనుకబడి ఉంది. 2019లో ఈవీల కార్లు కేవలం 1400లు మాత్రమే కొనుగోలు చేయబడ్డాయన్నారు. ఇది ప్రపంచ డిమాండ్‌తో పోలీస్తే చాలా తక్కువ శాతమన్నారు. దేశ మొత్తం ఆర్థికాభివృద్ధిలో ఆటో రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Read More: ఇకపై స్మోకింగ్ చేయాలంటే ఈ వయసు దాటాల్సిందే!

Related Tags