Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

ఇకపై స్మోకింగ్ చేయాలంటే ఈ వయసు దాటాలి… లేకుంటే జైలుకే!

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని.. టీవీల్లో, సినిమా థియేటర్స్‌లో, ఆఖరికి కాల్చుతున్న సిగరెట్లపై కూడా ముద్రించినా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా కాలేజీ యువత.. చిన్నవయసులోనే స్మోకింగ్..
Central Health Ministry mulls increasing legal age, ఇకపై స్మోకింగ్ చేయాలంటే ఈ వయసు దాటాలి… లేకుంటే జైలుకే!

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని.. టీవీల్లో, సినిమా థియేటర్స్‌లో, ఆఖరికి కాల్చుతున్న సిగరెట్లపై కూడా ముద్రించినా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా కాలేజీ యువత.. చిన్నవయసులోనే స్మోకింగ్ బారిన పడుడుతున్నారు. పోగ తాగటం ఓ ఫ్యాషన్‌గా భావించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్ వంటి జబ్బులను కొని మరీ తెచ్చుకుంటున్నారు.

ధూమపానాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది. అయినా మార్పు రావడం లేదు. దీంతో ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. స్మోకింగ్ చేసే వారి కనీస వయస్సును మార్చింది. ఇప్పటి నుంచి 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంలోని నిబంధనలను ఈ మేరకు కఠినతరం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఓ న్యాయ నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

న్యాయ నిపుణుల బృందం రూల్స్:

పొగాకు నియంత్రణ చట్టాన్ని సవరించడంపై న్యాయ నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దీనిపై ఈ బృందం కొన్ని రకాల సిఫార్సులను చేసింది. అవేంటంటే:

1. స్మోకింగ్ చేయడానికి వయోపరిమితి మార్పు
2. ప్రస్తుతం ఉన్న 18 సంవత్సరాల వయస్సును 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు
3. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పెంపు
4. పోగాకు సంబంధించిన ఉత్పత్తులను అక్రమంగా అమ్మినవారిని గుర్తించడానికి కొత్తగా ట్రాకింగ్ విధానం
5. బహిరంగంగా స్మోక్ చేయడం నిషేధం

పైన తెలిపిన రూల్స్‌ని ఎవరు పాటించకపోయినా.. కఠినమైన శిక్షలు అనుభవించేలా చర్యలు.

ఇది కూడా చదవండి: హాట్ టాపిక్‌గా మళ్లీ తెరపైకి స్మగ్లర్ వీరప్పన్ పేరు

Related Tags