ట్రంప్ భారత్ పర్యటన షెడ్యూల్ ఫిక్స్.. వివరాలు ఇవే!
ఫిబ్రవరి 24 న ఉదయం 11-55కు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు ట్రంప్ దంపతులు చేరుకుంటారు. అనంతరం ఫ్రెష్ అయి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మోతేరా స్టేడియానికి 22 కిమి రోడ్ షో గా ర్యాలీలో..
Donald Trump’s India tour schedule: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ పర్యటన సందర్భంగా ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించి భారత అధికారులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు.
ట్రంప్ పర్యటన వివరాలు: ఫిబ్రవరి 24న ఉదయం 11-55కు ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఫ్రెష్ అయి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మోతేరా స్టేడియానికి 22 కిలీమీటర్ల రోడ్ షో ర్యాలీలో పాల్గొననున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో అడుగడుగునా స్వాగతం పలికేలా హోర్డింగులు, ప్లకార్డులు, స్టేజీలపై నృత్యాలను అరెంజ్ చేశారు అధికారులు.
మధ్యాహ్నం 12.30కి స్టేడియం ప్రారంభం తర్వాత నమస్తే ట్రంప్ కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రజలనుద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.అక్కడి నుంచి 3.30కి మిస్టర్ అండ్ మిసెస్ ట్రంప్ ఆగ్రాకు బయల్దేరతారు. సాయంత్రం 4.45కు ఆగ్రాకు చేరుకుని తాజ్‌మహల్‌ని సందర్శిస్తారు. తిరిగి అక్కడి నుంచి ఇద్దరూ 6.45కి బయల్దేరుతారు. రాత్రి 7.30కి ఢిల్లీ పాలం ఎయిర్ పోర్టుకు వచ్చి.. రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని హోటల్ ఐటీసీ మౌర్యకు చేరుకుంటారు.
మరుసటి రోజు ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 9.55కు ట్రంప్ మెలానియా కలిసి రాష్ట్రపతి భవన్‌కు వస్తారు. 10.45కు రాజ్‌ఘాట్‌లో ఇద్దరూ కలిసి గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత 11.25కి హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను ట్రంప్ మెలానియా సందర్శిస్తారు. తర్వాత ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది.మోదీ-ట్రంప్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టె అవకాశం. మీటింగ్ తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే లంచ్ కార్యక్రమం ఉంటుంది.
మధ్యాహ్న భోజనం తర్వాత మధ్యాహ్నం 2.55కి ట్రంప్ యూఎస్ ఎంబసీకి వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఎంబసీ సిబ్బందితో ట్రంప్ భేటీ అవుతారు. సాయత్రం 5 గంటలకు తిరిగి ఆయన హోటల్ మౌర్యాకు వస్తారు. ఆరోజు రాత్రి 7.25 ట్రంప్- మెలానియా కలిసి రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ కోవింద్‌తో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు ట్రంప్ దంపతులకు ప్రెసిడెంట్ ఇచ్చే డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. అనంతరం రాత్రి 10 గంటలకు ట్రంప్ బృందం అమెరికాకు తిరుగు ప్రయాణమవుతుంది. ఇలా ట్రంప్ దంపతుల భారత్ పర్యటన ముగుస్తుంది.