భారత్‌ పర్యటనకు బయల్దేరుతూ మోదీ గురించి ట్రంప్ వ్యాఖ్యలు..!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం.. వాషింగ్టన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ బయల్దేరారు. విమానం ఎక్కేముందర మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానంటూ.. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. భారత ప్రజలను కలుసుకునేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానన్నారు. లక్షలాది మంది ప్రజలను మేము కలుసుకోబోతున్నానని. భారత ప్రధాని మోదీతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. మోదీతో కలిసే ఈ కార్యక్రమం కనీవినీ ఎరుగనంత గొప్ప కార్యక్రమం […]

భారత్‌ పర్యటనకు బయల్దేరుతూ మోదీ గురించి ట్రంప్ వ్యాఖ్యలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 24, 2020 | 10:14 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం.. వాషింగ్టన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ బయల్దేరారు. విమానం ఎక్కేముందర మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానంటూ.. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. భారత ప్రజలను కలుసుకునేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానన్నారు. లక్షలాది మంది ప్రజలను మేము కలుసుకోబోతున్నానని. భారత ప్రధాని మోదీతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. మోదీతో కలిసే ఈ కార్యక్రమం కనీవినీ ఎరుగనంత గొప్ప కార్యక్రమం అవుతుందని మోదీ తెలిపారంటూ యూఎస్ మీడియాతో ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు ట్రంప్ రేపు మధ్యాహ్నం భారత్ చేరుకోనున్నారు. తొలుత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు రానున్నారు. తొలిసారి భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మోదీ సర్కారు ట్రంప్‌కు వెల్కం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.