ATM theft: ఆ దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్ళారు..!

హైదరాబాద్ లోని పటాన్‌చెరు ఠాణా పరిధిలో ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారంలో ఇండీక్యాష్‌ ఏటీఎంను ఏర్పాటు చేశారు.

ATM theft: ఆ దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్ళారు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 24, 2020 | 10:39 AM

ATM theft: హైదరాబాద్ లోని పటాన్‌చెరు ఠాణా పరిధిలో ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారంలో ఇండీక్యాష్‌ ఏటీఎంను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎంటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేష్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అపహరణ సమయానికి ఏటీఎంలో రూ.2.27 లక్షలు ఉన్నట్టు ఇండీక్యాష్‌ ప్రతినిధులు తెలిపారు.

కాగా.. పోలీసులు క్లూస్‌ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఈ ఘటన చోటు చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దుండగులు చోరీకి ముందు సీసీ కెమెరాల తీగలు కత్తిరించారు. అక్కడికి సమీపంలో ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల పుటీజీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఐదుగురు వ్యక్తులు ఏటీఎంను పెకిలించి మినీ డీసీఎంలో తరలించినట్టు భావిస్తున్నారు. ఇదే ఏటీఎంలో గతంలోనూ రెండు సార్లు చోరీయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.